ద్వారక

ద్వారక శ్రీక్రిష్ణుని దివ్య క్షేత్రాలలొ అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్ లొని ఈ దివ్యధామం శ్రీక్రిష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బ...

ద్వారక

శ్రీక్రిష్ణుని దివ్య క్షేత్రాలలొ అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్ లొని ఈ దివ్యధామం శ్రీక్రిష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీక్రిష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్థావన వుంది. శ్రీక్రిష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.


నాగేశ్వర లింగం-దారుకావనం

నాగేశ్వర లింగము : ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసరుడు కోపామును పట్టలేక తన చేతిలోని గదచె సుప్రియుని తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరుపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.

మొక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. భారత దేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామాం ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.

ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్టితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది.

అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక I 
పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక II       -  గరుడ పూర్ణిమ

క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవీక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి.

ద్వారకాధీశుడి ఆలయం


ప్రస్తుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం(కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్)16వ శతాబ్ధంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5 అంతస్థుల ఈ ఆలయం లైమ్‌స్టోన్ మరియు ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్నజండా ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేస్తారు. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్షద్వారం. భక్తులు స్వర్గద్వారం గుండా ఆలయప్రవేశం చేసి మోక్షద్వారం గుండా వెలుపలికి వస్తారు. ఈ ఆలయము నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి మరియు సత్యభామాదేవి ఆలయాలు ఉన్నాయి. బెట్ ద్వారకా ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం

ఈ నగరం పేరులోని ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్ధాలు ఉన్నాయి. ద్వార్ అనే పదము ఆధారంగా ఈ నగరానికి ఆఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రముగా భావిణంచే చార్ ధామ్ (నాలుగు ధమాలు) ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాధ్, పూరి, రామేశ్వరం. ఈ నగరం వైష్ణవుల చేత గౌరవించబడింది. ద్వారకాధీశుని ఆలయం జగత్‌మందిరం అని పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వరకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటి అయ్న నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఈ మఠం శ్రీకృష్ణభగవానుడికి సమర్పించబడింది. ఆది శంకరాచార్యుడితో ప్రతిష్ఠించబడిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి మరియు జ్యోతిర్మఠం. ద్వారకా పీఠంను కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాధ్ మహత్యం

ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్టించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈక్షేత్రం ఒకటి.

దర్శనం సేవలు మరియు ఉత్సవాలు

ద్వారకానాధుడికి అనేక సేవలు దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులు జరుగుతుంటాయి. ఈ దర్శనాలు వల్లభాచార్యుల చేత వ్రాయబడిన పుష్టి మార్గాంలో వ్రాయబడినట్లు జరుగుతాయి. ద్వారకానాధుని ఆలయం పుష్టి మార్గ ఆలయం. దర్శనాలు వరుసగా
మంగళ.
శృంగార్.
గ్వాల్.
రాజభోగ్.
ఉథాపన్.
భోగ్.
సంధ్యా ఆరావళి.
ష్యాన్.

ద్వారకా సామ్రాజ్యం

మహాభారతం, హరివంశం, స్కంద పురాణం, భాగవత పురాణం మరియు విష్ణు పురాణం లాలలో ద్వారకాపురి ప్రస్థావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసి సముద్రగర్భంలో కలసి పోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు.

స్థాపన

శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్ధాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కధనాలు వర్ణిస్తున్నాయి. శ్రీకృష్ణుడు కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడిని చెరసాల నుండి విముక్తిడిని చేసి మథుర కు రాజును చేసాడు. కంస వధకు కినిక చెందిన అతడి మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలసి 17 మార్లు మథుర మీద దండయాత్ర చేసాడు. యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్రపరివేష్టితమైన భూమిలో ద్వారకానగరిని నిర్మించి దానికి మథురలోని యాదవులను తరలించాడు. 17 మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యాలంతటిని క్షీణింపజేసుకున్నాడు. ఒక్కో మారు జరాసంధుడు 18 అక్షౌహినుల సైన్యంతో దాడి చేసే వాడు. మహారత యుద్ధంలో పండవుల మరియు కౌరవుల సైన్యం మొత్తము 18 అక్షౌహినులు. శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగా మథురను వదిలి వెళ్ళాడు. జరాసంధుడు 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా.

నిర్మాణంలో పాల్గొన్న వారు

ద్వరకా నగరం శ్రీకృష్ణుడి అజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్రా పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్ధం ఎంచుకొనబడింది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడినది. గోమతీనదీ తీరంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరాన్ని ద్వారామతి, ద్వారావతి మరియు కుశస్థలిగా పిలువబడింది. ఇది ఆరు విభాగాలుగా నిర్వహణా సౌలభ్యం కొరకు విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడలులు, సంతలు, రాజభవనాలు మరియు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం. ఈ నగరంలో 7,00,000 ప్రదేశాలు స్వర్ణ, రజిత మరియు మణిమయమై నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణుడి 16108 మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ నగరంలో సుందర సరస్సులతో సర్వకాలంలో పుష్పించి ఉండే వివిధమైన వర్ణాలతో శోభిల్లే ఉద్యానవనాలు ఉంటాయి.

సముద్రంలో మునుగుట

శ్రీకృష్ణుడు తన అవతారమును చాలించి వైకుంఠము చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన మునుల శాపప్రభావాన తమలోతాము కలహించికొని నిశ్శేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్ధం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరాన్ని దాటిన యాదవులు ద్వారకానగరం సముద్రజలాల్లో మునిగి పీఓవడం వెనుతిరిగి చూసి హాహాకారాలు చేసారు. అర్జునుడు ఈ విషయం హస్థినాపురంలో వర్ణిస్తూ " ప్రకృతి ద్వారకానగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకానగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తనజలాల్లో ముంచివేసింది. అందమైన భవనాలు ఒకటి తరువాత ఒకటి మునగడం నేను కళ్ళారా చూసాను. అంతా మునిగి పోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒకసరస్సులా ఆ ప్రదేశం కనిపించింది. అక్కడ నగరం ఉన్న జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే " . విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్థావించింది. ఇలా ద్వారకానగరం సముద్రగర్భంలో కలసి పోయి అంతటితో ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియగానికి నాంది పలికాడు.

ఆధునిక నిర్మాణశాస్త్ర నిపుణుల పరిశోధనలు

2001 మే 19న అప్పటి భారతీయ సైన్స్& ‍టెక్నాలజీ మంత్రి అయిన మురళీ మనోహర్ జోషీ ద్వరకానగర శిధిలాలను గల్ఫ్ ఆఫ్ ఖంభాత్ సముద్రగర్భంలో కనుగొనబడినట్లు ప్రకటించాడు. గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో ఈ శిధిలాలు గుజరాత్ సముద్రతీల సమీపంలో 40 మీటర్ల లోతులో 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు కనుగొనబడ్డాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడినది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబర్ మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యా సంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునుగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాల లోని భాగాలు యు కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపబడ్డాయి.

బెట్ ద్వారక

బెట్ ద్వారక ప్రధాన దైవంమైన శ్రీకృష్ణుని ఆలయలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపారం మరియు వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మరియు మతప్రధానమఇన కేంద్రం శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందని విశ్వసించబడుతుంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి. అత్యంత పుస్కలంగా పురాతన వస్తువులు లభించిన సాంస్కృతిక ప్రదేశాలు బెట్ ద్వారకా I, II, VI, మరియు IX. బేట్ ద్వారకలో లభించిన వస్తువులను రెండు బృహత్తర కాలాలకు సంబంధించినవిగా విభజించించారు. వీటిలో మూడు తలల కల జంతువుతో అలంకరించబడిన శంఖం ఒకటి, మూడు వ్రాతఫలకాలు, ఒక రాగి చేపలగాలం మరియు హరప్పన్ సాంస్కృతిక(క్రీ పూ 1700-1400 )ల చివరికాలపు మృణ్మయ పాత్రలు మరియు చారిత్రక సమయాన్ని సూచించే నాణ్యాలు మరియు కుండలు. ఈ సముద్రతీర సముద్రగర్భ పరిశోధనలు బెట్ ద్వారకాద్వీపం దాని చుట్టుపక్కల ప్రదేశాలు సముద్రతీవ్రత మూలంగా భూఊచకోతకు గురి అయిన విషయాన్ని బలపరుస్తుంది. సముద్రపు పొంగు వలన మునిగిపోయిన ప్రదేశాలలో బెట్ ద్వారక ఒకటి. సముద్రగర్భ బెట్ ద్వారకా పరిశోధనలన అనేక ఆకారములలో రాతి లంగర్లు వెలుగులోకి వచ్చాయి. త్రిభుజాకారము, గ్రేప్నెల్ మరియు వృత్తాకారపు రాతిలంగర్లు లభించిన వాటిలో ఒకటి. అవి ఆయా ప్రాంతీయమైన రాయితో చేయబడినవి వాటి కాలనిర్ణయము కూడా ద్వారకలో ఉన్న రాళ్ళను పోలి ఉంది. సమీపకాలంలో రోమన్ పరిశోధనలలో పురాతన వస్తువులలో మృణ్మయ కూజా పెంకులు మరియు సత్తు(లీడ్) పోత బిళ్ళలు, మరియు సత్తు లంగర్లు లభించాయి. బెట్ ద్వారకలో రోమన్ నౌకా అవశేషాలు ఉన్నట్లు కనుగొనబడింది. ఈ పరిశోధనల కారణంగా భారతదేశ విదేశీ వాణిజ్యానికి ముఖ్యంగా పశ్చిమదేశాలతో సాగించిన వాణిజ్యానికి సంభంధించిన అధారాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశం రోమ్‌తో క్రీ 4 శతాబ్ధం నుండి క్రీ శ 4వ శతాబ్ధం వరకు చురుకుగా నౌకాయాన వ్యాపారం సాగించిందని ఈ పరిశోధనల వలన రుజువైనది. ఈ పరిశోధనలలో కాలనిర్ణయం మీద ప్రత్యేక దృష్టి ఇవి క్రీ పూ 1వ క్రీ శ 2 శతాబ్ధాలనాటివని కనిపెట్టారు. బెట్ద్వారకలో లభించిన ఈ మృణ్మయ కూజాలు భారతదేశానికి రోమన్‌దేశాలతో పురాతనకాల వ్యాపారసంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ లభించిన ఏడు కూజాలకు ఉపయోగించిన సీలు పరిశోధిస్తే అవి రోమన్లు ద్రాక్షారసం మరియు ఆలివ్ ఆయి ఎగుమతికి ఉపయోగిస్తారను భావిస్తున్నారు. మృణ్మయ పెంకులపై జరిగిన విస్తారమైన పరిశోధనలు క్రీస్తు శకం ఆరంభంలో బెట్ ద్వారకకు అంతర్జాతీయంగా ఉన్న వ్యాపారసంధాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిశోధనలు బెట్ ద్వారకా సముద్రగర్భంలో రోమన్ వ్యాపార సంబంధాలను ఋజువు చేయగల నౌకా అవశేషాలు లభిస్తాయని భావిస్తున్నారు. మృణ్మయ పాత్రలు బెట్ ద్వారకకు రోమ్‌తో కల వ్యాపార సంబంధాలు ముందు ఊహించిన దానికంటే ముందు నుండి ఉన్నాయని నిరూపిస్తున్నాయి. ఈ పూరాతత్వ పరిశోధనలలో లభించిన లంగర్లు భారతదేశ పశ్చిమతీరాలలో అనేక రేవులు, ఓడలునిపు గట్లు మరియు లంగరువేయు కేంద్రాల అవశేషాలు ఉన్నట్లు సూచిస్తున్నా బెట్ ద్వారక సమీపంలో అలాంటి గట్లు ఏమీ లేవు . అయినా ఇక్కడ లభించిన రాతి లంగర్లు మాత్రం ఎత్తైన బెట్ ద్వరకా సముద్రతీరాలు నైకలు లంగర్ వేసి నిలవడానికి వీలుగా ఉన్నాయని భావిస్తున్నారు. కనుక బెట్ ద్వారక సహజసిద్ధమైన రేవుపట్టణం. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన అనేక విధములైన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బెట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బెట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని శక్తివంతమైన సముద్రతంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.




సముద్రగర్భంలో ఉన్న ద్వరకానగరాన్ని చూపడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ప్రతిపాదన చేయబడింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పర్యాటకరంగం ఈ ప్రతిపాదన మీద పనిచేస్తున్నారు. రెండుదశాబ్ధాలపాటు జరిగే ఈ ప్రణాళిక పూర్తి చేసుకుంటే అది ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి సముద్రాంతర వస్తుప్రదర్శనశాల ఔతుంది.

COMMENTS

పేరు

temples,28,
ltr
item
ApurupA Bhakti: ద్వారక
ద్వారక
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhEEVfKAVGQErr4hwC64Uoag9D9nhlr0tlBfuzH8w9MrtYl8gOarfzK-xp0nHIkq3JGvLfZWfIzZsZjNUpdTcQBdIMAQMtfKJvApzPaUG7GHsO0u_AikwlzxbQ5Cm0-tBcV1Ll6lRHbn4sL/s1600/brindavan_and_dwarka.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhEEVfKAVGQErr4hwC64Uoag9D9nhlr0tlBfuzH8w9MrtYl8gOarfzK-xp0nHIkq3JGvLfZWfIzZsZjNUpdTcQBdIMAQMtfKJvApzPaUG7GHsO0u_AikwlzxbQ5Cm0-tBcV1Ll6lRHbn4sL/s72-c/brindavan_and_dwarka.jpg
ApurupA Bhakti
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_25.html
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_25.html
true
7109105649913831149
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy