శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయ...


శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్వర్యం నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.

తిరువనంతపురం, కేరళ రాష్ట్రానికి రాజధాని. దీనిని బ్రిటీషు పరిపాలనా కాలములో ట్రివేండ్రం అని పిలిచేవారు. ఇది ఒక రేవు పట్టణము. అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలొనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం  పంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.


స్థలపురాణం

తాళపత్ర గ్రంధాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం'లో ప్రతిష్టించినట్లు కథాంశం.

చరిత్ర

ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో(పద్మతీర్ధంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది(6వ శతాబ్ధం-9వ శతాబ్ధం). క్రీ.శ 16వ శతాబ్ధం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం).
ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.
అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునె తిరువనంత పురానికి ఆ పేరు వచ్చినది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్థు గా పెట్టుకున్నారు. ప్రస్తుత మున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడ డానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వార గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి

అనంత సంపద

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయం లో బయల్పడిన అనంత సంపద తో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలొ నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేస్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి వున్నది. ఆలయంలో దేవునికి సంబందించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనబై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదస్ వెలుగు చూసింది. ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి వున్నది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ క్రిష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ వున్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి వున్నది.

ఆలయ నిర్మాణం

ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది. సుమారు 5వ శతాబ్దకాలంలో 'చేరమాన్ పెరుమాళ్' అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం క్రీ.శ.1050 వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తున్నది. తరువాత క్రీ.శ.1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన 'వీరమార్తాండ వర్మ' అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈయన హయాంలో క్రీ.శ.1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఆరు మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. పదిరోజులపాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉన్నది. క్రీ.శ.1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. క్రీ.శ.1461లో ఒక రాతిపై 'ఓట్టకల్ మండపం' నిర్మాణం జరిగింది. అనంతరం క్రీ.శ.1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు 'రాజా మార్తాండ వర్మ' కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి.

ఆలయ సౌందర్యం

ప్రధానాలయం మళయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో 'పుష్కరిణి' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.

ప్రధాన ఉత్సవాలు


ప్రతి సంవత్సరం ఆరు మాసాలకు ఒకసారి తులా మాసం (సెప్టెంబరు / అక్టోబరు)లో, ఫాల్గుణ మాసం (మార్చి / ఏప్రిల్) లో 'అల్పిసి ఉత్సవాలు' జరుగుతాయి. తులా మాసంలో జరిగే ఉత్సవాలాలో 'ఆరాట్టు' ఊరేగింపు ప్రధానమైనది. శ్రీ పద్మనాభ, శ్రీనారసింహ, శ్రీకృష్ణ దేవతా విగ్రహాలను గరుడవాహనంపై ఊరేగించి సముద్ర స్నానాలకు తీసుకొని వెళతారు. ఈ ఊరేగింపు అధికార లాంఛనాలతో రాజు కరవాళం చేతబట్టి ముందు నడవాల్సి ఉంది.

దివ్యదేశాలు

జ్యోతిర్లింగాలు 12 ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురంలోని ఈ అనంతపద్మనాభస్వామి దేవాలయం. అనంతపద్మనాభుడు హిందువులకు అతి పవిత్రమైన దేవుడు. ఈ దేవాలయ గోపుర నిర్మాణం 16 వ శతాబ్దంలోజరిగింది. 18 వ శతాబ్దంలో చిట్టచివరి మెరుగులు దిద్దారు. అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం. అనంత పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి, తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పుముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు. అనంతుడు లేదా ఆదిశేషువు మీద శయనించిన భంగిమలో విష్ణువు దర్శనమిస్తాడు. నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి. ఎవరైనా ఆయనకు ముడుపులు చెల్లిస్తే, అది నేరుగా భగవంతునికే చెందుతుంది. విష్ణువు... శయనించి, కూర్చుని, నిలబడి... మూడు భంగిమలలో దర్శనమిస్తాడు. పద్మనాభుని విగ్రహంలో ముఖభాగం, వక్షస్థలం మినహా... కిరీటం, కుండలాలు, మెడలో ధరించిన సాలగ్రామహారం, కంకణం, కమలం, కాళ్లు... అన్నీ బంగారంతో తయారైనవే. కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈయన మీద పడలేదని మహారాజు భావించేవారు.



ఈ దేవాలయానికి ఆరు నేలమాడిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంటారు. వాటికి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఎ, బి మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు.

COMMENTS

పేరు

temples,28,
ltr
item
ApurupA Bhakti: శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicocZA5E36SXiHvho6VbKmOUaATyKvZQapvuNrj5qbq1hYBctA2x5KqvUTxaABuvsYrf_SxbxDvqAJ4HRp5VRfA2oaG3QCkmrTuoXOoHoszr4rq0_49b49Jjw7kK9LpqvzcYAv4tDi92me/s1600/Anantha-Padmanabha-Swamy-temple-Kerala.jpeg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicocZA5E36SXiHvho6VbKmOUaATyKvZQapvuNrj5qbq1hYBctA2x5KqvUTxaABuvsYrf_SxbxDvqAJ4HRp5VRfA2oaG3QCkmrTuoXOoHoszr4rq0_49b49Jjw7kK9LpqvzcYAv4tDi92me/s72-c/Anantha-Padmanabha-Swamy-temple-Kerala.jpeg
ApurupA Bhakti
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_63.html
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_63.html
true
7109105649913831149
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy