సలేశ్వరం

సలేశ్వరం ( Saleshwaram)  ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన,   చారిత్రిక ప్రాముఖ్యత గల    అద్యాత్మిక...

సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన, చారిత్రిక ప్రాముఖ్యత గల  అద్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.
ఇది ఇది మన రాష్ట్రంలోనె మాహబూబ్ నగర్ జిల్లా లో నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే  హైదరాబాద్ రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.

చరిత్ర

అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరుపుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్పేరిట పులలు సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పులల సరక్షణా కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వఎళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత కక్షిణం వైపుకి తిరిగి పస్చ్మ వైపున వున్న గుట్టపైన కిలొ మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చ్రు కొన్నాక అమల్లీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలుసన్నలి జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలుదట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగాస్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైన లింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మ విగ్రహాలున్నాయి.

జాతర

సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందురెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.

చారిత్రల ఆధారాలు :

నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలో మూస:చుళధమ్మగిరి గురించిన పరస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలువిహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టాడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా ...... చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విక్ష్ణు కుండినులు క్రీ.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం వున్నది. ద్వార బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం వున్నది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుదాలు వున్నాయి. కుడి చేతిలో గొడ్డలికత్తిఒక ఎడమ చేతిలో డమరుకంమరొ ఎడమ చేయి కింది వాలి ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి వున్నది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించె విసురు రాయి వున్నది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి వుంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడ వున్నది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యం లో సలేశ్వరాన్ని రుద్ర కుండంగాదీనికి ఈశాన్యన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగాపశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బ్.ఎన్ శాస్త్రి నిరూపించారు. క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్ర లో శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలో కూడ ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడ ఇక్కడ అశ్రయం పొందినట్లు షానిక చరిత్ర వల తెలుస్తున్నది.

ప్రకృతి

సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమంది మెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరం లోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకుఆ తరువాత అబౌద్ద బిక్షవులకుఆపైన మునులకుఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆదారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకుపర్యాటకులకుచరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.



COMMENTS

పేరు

temples,28,
ltr
item
ApurupA Bhakti: సలేశ్వరం
సలేశ్వరం
ApurupA Bhakti
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_82.html
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/
https://apurupabhakti.blogspot.com/2013/12/blog-post_82.html
true
7109105649913831149
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy